Indian Navy | ఇండియన్ నేవీలో ఉద్యోగం…

Indian Navy | ఇండియన్ నేవీలో ఉద్యోగం…
Indian Navy | ముధోల్, ఆంధ్రప్రభ : ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించిన ముధోల్ మండలంలోని రజనీ తండా వాసులు చవాన్ సచిన్‌కు గ్రామస్థులు ఘన సన్మానించారు. చవాన్ భీమ్ రావు – సింధు భాయ్ దంపతుల కుమారుడు చవాన్ సచిన్ ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవీ (Indian Navy) లో ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తము చేశారు.
ఈ రోజు అంబిక వికాస్ జాదవ్ ఆధ్వర్యంలో సచిన్ నివాసంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అంబిక వికాస్ జాదవ్ గారు మాట్లాడుతూ… రజనితండాకు చెందిన యువకుడు దేశ సేవలో భాగస్వామ్యం కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. సచిన్ మరెందరో యువతకు స్ఫూర్తిగా నిలవాలని, భవిష్యత్తులో అతను మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తండా పెద్దలు, యువకులు, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

