BR | భారత రాజ్యాంగ దినోత్సవం

BR | భారత రాజ్యాంగ దినోత్సవం

BR | తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఆంద్రప్రభ : భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. YSRCP ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారు మరియు తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తలారి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమంలో తిరుపతి నగర మేయర్ డాక్టర్ ఆర్. శిరీష గారు, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం గారు, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి గారు పాల్గొని అంబేద్కర్ గారి సేవలను స్మరించుకున్నారు. అలాగే రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లాని బాబు, కార్పొరేటర్ అరణి సంద్యా, ధనశేఖర్, గీతా యాదవ్, మునిరాజా, శాంతారెడ్డి, జ్యోతి, కృష్ణవేణమ్మ, ప్రసాద్, నాగేంద్ర, పవని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply