వెలుగు కార్యాలయంలో 50 లక్షలు గోల్మాల్ !

వెలుగు కార్యాలయంలో 50 లక్షలు గోల్మాల్ !
రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : మండలం ముచ్చనిపల్లి గ్రామానికి చెందిన బుక్కు కీపర్ తన చేతివాటాన్ని ప్రదర్శించి చాకచక్యంగా 50 గ్రూపులు దాచుకున్న పొదుపు ఖాతా నుండి డబ్బులు గోల్మాల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముచ్చనపల్లి గ్రామానికి చెందిన బుక్ కిపర్ మౌనిక తన పరిధిలోనే ఉన్న 50 పొదుపు సంఘాల నుండి పొదుపు డబ్బులను స్వాహా చేసింది కొందరు మహిళలు బుధవారం విస్సన్నపేట ఇండియన్ బ్యాంక్ ముందు మహిళలు పెద్ద ఎత్తున గుమ్మిగుడి సంబంధిత బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు చిన్న చిన్న పొరపాట్లు ఉంటేనే డబ్బులు ఇవ్వని మీరు సంబంధిత మహిళలతో కుమ్మక్కైనట్లు దూయ్యబట్టారు.
ఏపీఎం, రామకృష్ణ, సీసీ మౌనిక, విస్సన్నపేట ఇండియన్ బ్యాంకు శాఖ అధికారులు, కుమ్మక్కై 50 లక్షలు గోల్మాల్ చేశారు. రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో మహిళా మండలి 50 గ్రూపుల్లో డబ్బులు సుమారు 50 లక్షల రూపాయలు విస్సన్నపేట ఇండియన్ బ్యాంకు శాఖ నుంచి మహిళా మండలి సభ్యులకు తెలియకుండా సిసి బత్తుల మౌనిక, రెడ్డిగూడెం ఏపిఎం రామకృష్ణ, మరొక సీసీ సహాయంతో భారీగా దోపిడి చిన్న సంతకం తేడా వస్తేనే డబ్బులు ఇవ్వని బ్యాంకు వాళ్లు సీసీలతో ఏపీఎంతో కుమ్మక్కై డ్వాక్రా లక్షల రూపాయల సొమ్మును దోచారు.
కాయ కష్టం చేసి మహిళా మండలి సభ్యులు పొదుపు చేస్తుంటే బ్యాంకు అధికారులతో కుమ్మక్కే అధికారులు దోపిడీ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కట్టిన డబ్బులు తమకు సంబంధించిన 50 డ్వాక్రా గ్రూపులలో అమౌంట్ ఉండాలని డ్వాక్రా గ్రూపు సభ్యులు విస్సన్నపేట ఇండియన్ బ్యాంకు శాఖ ముందు ఆందోళన చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాజా మాట్లాడుతూ బాధితులు ఖాతాలో అమౌంట్ వచ్చేలాగా చూడాలని బాధితులకు న్యాయం చెయ్యాలి అమౌంటు తీసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిచారు.
