IndiaAmerica | చిచ్చుకు చైనా జిత్తులు?

IndiaAmerica | చిచ్చుకు చైనా జిత్తులు?

IndiaAmericaChina | న్యూస్ డెస్క్ : భారత్లోని అరుణాచల్ ప్రదేశ్, తన పొరుగునున్న తైవాన్, దక్షిణ చైనా సమద్ర తీరం లోని కొన్ని ప్రాంతాలు, టిబెట్ లోని కొంత భాగం తమవిగా చైనా చాలా కాలంగా వాదిస్తోంది. అయితే అరుణాచల్ విషయంలో భారత్, తైవాన్(India, Taiwan) విషయంలో అక్కడి ప్రభుత్వం, దక్షిణ సము ద్రంపై చైనా వాదనలను ఆ ప్రాం తంలోని చాలా దేశాలు చైనా వాదనలను అంగీకరించడం లేదు. అయితే, 2049 నాటికి వీ టన్నింటిని చేజిక్కించుకుని అతిపెద్ద శక్తిగా అవతరించాల న్నది చైనా యోచన అని.. పెంటగాన్(Pentagon) అభిప్రాయపడింది. అందులో భాగంగా తమ దేశా నికి (అమెరికా)కు భారత్కు మధ్య దూరాన్ని పెంచేందు కు భారత్తో సానుకూల వైఖరిని ప్రదర్శిస్తోందని పేర్కొంది.

IndiaAmerica | సమస్య లను పరిష్కరించే యత్నాలు

IndiaAmerica
IndiaAmerica

చైనావ్యవహారాలు, యోచనలు- 2025 లకు సంబంధించి పెంటగాన్ తాజాగా ఒక నివేదికను విడు దల చేసింది. అయితే, పెంటగాన్ అంచనా ప్రకారం, ఇదే తరహా వ్యూహాన్ని(type of strategy) విజయవంతంగా కొనసాగిస్తే.. చైనా తను అనుకున్నది సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. భారతను మచ్చిక చేసుకుని, అమెరికాను దూరం చేందుకు చైనా కుయుక్తులు పన్నుతోందని ఆ నివేదికలో అమెరికా పేర్కొంది. భారత్లో వివాదలను పరిష్కరించు కునేందుకు ఇటీవలి కాలంలో చురుకుగా ప్రయత్నిస్తుండటాన్ని పెంటగాన్ ఉదాహరణలు(Examples)గా పేర్కొంది.

ముఖ్యం గా వాస్తవాధీన రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో సమస్య లను పరిష్కరించే యత్నాలు మొదలుపెట్టింది. 2024 అక్టోబర్లో జిన్పింగ్ – మోడీ బ్రిక్స్(Jinping – Modi BRICS) భేటీలో బలగాల ఉప సంహరణపై కీలక నిర్ణయం తీసుకోవడాన్ని పెంటగాన్ ప్రస్తావించింది. దానికి అనుగుణంగా నెలవారీ సమావేశాలు పెట్టుకోవడం, భారత్- చైనా మధ్య నేరుగా విమానాల రాకపోకలు(Flight arrivals) పునరుద్ధరించడం, పరస్పర ప్రయోజనాలను కాపాడుకోవడం వంటి చర్యలు తీసుకున్నాయని పేర్కొంది. చైనా ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. గతానుభవాల దృష్ట్యా భారత్ ఆచితూచి వ్యవ హరిస్తోందని, చైనాను గుడ్డిగా నమ్మడం లేదని అమెరికా అభిప్రాయపడింది.

దక్షిణ సముద్రం, సెనకకు దీవులు, అరుణాచల్ ప్రదేశ్, తైవాన్లను(Pradesh, Taiwan) స్వాధీనం చేసుకోవడం చైనా ఆలోచనల్లో కీలకమైనది. అందుకోసం రాజీపడకుండా.. వివాదాలున్న దేశాలతో నేర్పుగా వ్యవహరించడానికి చైనా ప్రయత్నిస్తోందన్నది పెంటగాన్ భావన. హాంగ్ కాంగ్, తైవాన్, జింజియాంగ్, టిబెట్ల లో చైనా వ్యతిరేకత శక్తు లను అణచివేత చైనా ప్రాధామ్యాలలో మరో కీలక అంశమని(Another key point) పేర్కొంది. అయితే, అరుణాచల్ విషయంలో చైనా ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తోందో ఇటీవలి పరిణామాలు చెబుతున్నాయి.

IndiaAmerica | భూభాగాలు కలుపుకోవడం కోసం

భారత్తో సత్సంబంధాలు నెరు పుతూనే.. అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. లడఖ్ తూర్పు ప్రాంతంలో భారత, చైనా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలను విరమించుకుని ఉండవచ్చు. అయితే, ఇరుదేశాల మధ్య అప్పుడప్పుడు ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. అయితే, తమ దేశం ప్రధాన ఆశక్తులను(Major powers) దృష్టిలో ఉంచుకుని చైనా తరచూ అరుణాచల్ భూభాగాల గురించి ప్రస్తావన చేస్తూ ఉంటుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలకు అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన సమస్య కావచ్చునని పెంటగాన్ వివరించింది.

2049 నాటికి చైనా మరింత పునరుజ్జీవన శక్తి(Rejuvenating power)తో రూపొందడానికి అరుణాచల్ ప్రదేశ్, తైవాన్, దక్షిణ చైనా ప్రాంతంలోని కొన్ని భూభాగాలు కలుపుకోవడం కోసం చైనా ప్రయత్నాలు సాగిస్తోందని పెంటగాన్ వివరించింది. చైనా ఇప్పటికే ప్రపంచంలో చెప్పుకోదగిన సైనిక శక్తిని కలిగి ఉంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని తన బలాన్ని చాటుకోగల శక్తిని కలిగి ఉంది. పైగా పాకిస్తాన్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని పేర్కొంది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఈశాన్య రాష్ట్రాల్లో(In the northeastern states) ప్రధానమైన ఈ రాష్ట్రం ఇప్పటికీ తమ దేశంలో అంతర్భాగంగా ఉందనీ, ఎప్ప టికీ ఉంటుందని భారత్ ఇప్పటికి ఎన్నో సార్లు స్పష్టం చేసింది.

లడఖ్ తూర్పు ప్రాంతంలో వాస్తవాధీన రేఖ(Line of Actual Control) వద్ద ఇరుదేశాల మధ్య చిచ్చు రేపింది ఇక్కడే. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొన్ని మాసాల పాటు కొనసాగాయి. ఈ మధ్యనే అవి సర్దుకున్నాయి. గత వారం లండన్ నుంచి జపాన్ వెళ్తున్న ప్రేమా థోంగ్జోక్ షాంఘైలో దిగినప్పుడు ఆమెను 18 గంటల సేపు చైనా అధికారులు నిర్బంధించారు. తన అరుణాచల్ ప్రదేశ్లో పుట్టానన్న కారణం చెప్పి చైనా అధికారులు తనను నిర్బంధించారని ఆమె ఫిర్యాదు చేశారు. తనకు 18 గంటల సేపు మంచి నీరు కూడా ఇవ్వలేదనీ, భోజనం కల్పించలేదని కూడా ఆమె ఫిర్యాదు చేశారు. షాంఘైలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి సుదీర్ఘమైన సంప్రదింపులు(A lengthy consultation) తర్వాత తనను వారు విడిచి పెట్టారని ఆమె చెప్పారు.

తన మాదిరిగానే అరుణాచల్ ప్రదేశ్ తన జన్మస్థలమని దరఖాస్తులో పేర్కొన్నందుకు ఒక యూట్యూబరి(YouTuber)ని కూడా చైనా అధికారులు నిర్బంధించారని ఆమె తెలిపారు. అరు ణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ భారత్ అంత్రభాగంగా ఉన్నప్ప టికీ, అక్కడి నుంచి వచ్చిన వారిని చైనా అధికారులు ఇదే మాదిరిగా నిర్బంధిస్తున్నారని ఆమె చెప్పారు. ఆ యూ ట్యూబర్ తవాంగ్ ని థాంగ్ డాక్ని సమర్థిస్తూ మాట్లాడినందుకు చైనా అధికారులు అతడిని నిర్బంధించారని ఆమె ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశికి చెందినవారిని ఇదే మాదిరిగా అమెరికన్ అధికారులు(American officials) ప్రశ్నలతో వేధించి తమను చైనాకి చెందిన వారిగా అనుమానిస్తున్నారనీ, లడఖ్ చోటు చేసుకున్న పరిణామాలపై ప్రశ్నలు వేస్తున్నారని మాజీ దౌత్యవేత్త ఒకరు చెప్పారు.

IndiaAmericaChina | ప్రపంచ దేశాలను భయపెట్టే

అమెరికన్ అధికారులు ఈ మాదిరిగా సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన వారిని వేధిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని మహేష్ సన్దేవ్(Mahesh Sandev) అనే భారతీ యుడు కూడా ధ్రువీకరించారు. కాగా, వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలను తగ్గించడం చైనా అనుసరిస్తున్న దీర్ఘకాలిక ద్వంద్వ విధానమని అమెరికా పేర్కొంది. పాకిస్తానో సంబంధాలను నెరుపుతూనే, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను(Tensions at the borders) పెంచుతూ చైనా ద్వంద్వ విధానాన్ని అనుసరిస్తోం దని అమెరికా పేర్కొంది.

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) సమయంలో ఈ విషయం స్పష్టం అయిందని అమెరికా పేర్కొంది. ఈ పోరులో పాకిస్తాన్ చైనా సరఫరా చేసిన ఆయుధా లనూ, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఉపయోగించిందని అమెరికా ఆరోపించింది. అమెరికాకు, భారత్ దగ్గర కావ డం ఇష్టం లేదనీ, అందుకనే ఈ వ్యూహాన్ని అనుసరిస్తోందని అమెరికా ఆరోపించింది. కాగా పెంటగాన్ నివేదికను చైనా తప్పుపట్టింది. చైనా రక్షణ వ్యూహాలకు(to China’s defense strategies) పెంటగాన్ తప్పుడు భాష్యం చెబుతోందని, ప్రపంచ దేశాలను భయపెట్టే.. ఆధిపత్యం చెలాయించే యోచన చైనాకు లేదని తేటతెల్లం చేసింది.

Leave a Reply