England| వాళ్లు పెద్ద ముదుర్లు

England| వాళ్లు పెద్ద ముదుర్లు
కేర్‌ఫుల్‌గా లేకుంటే కొంప కొల్లేరే..
సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ ఢీ
అద్భుత ఫామ్‌లో ఇంగ్లిష్ ఆటగాళ్లు
ఆ జట్లులో అద్భుత ప్లేయర్లు
వారితో జాగ్రత్త పడకుండే భారత్‌కు ముప్పే
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ 2026 చివరి దశకు చేరుకుంది. భారత్ ఎట్టకేలకు సెమీస్‌కు చేరుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ మార్చి 5, గురువారం జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. టీమిండియా ఫైనల్ చేరుతుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు. అయితే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేని పరిస్థితి ఉంది. ఈ టోర్నీ ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టు సాధారణంగా కనిపించినా.. ఇప్పుడు వేరీ స్ట్రాంగ్ అనిపిస్తుంది. ఇందుకు కారణం ఆ జట్టు ఆట తీరే.. జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు తప్ప అందరూ ఫామ్‌లో ఉన్నారు. ఏ ఒక్కరు చెలరేగినా భారత్‌కు కష్టాలు తప్పవు. అయితే ఇంగ్లండ్ జట్టులో ఐదుగురు ప్రమాదకర ప్లేయర్లు ఉన్నారు. వారు ఏ క్షణంలోనైనా చెలరేగి విజయాన్ని తమ వైపుకు తిప్పుకునే ప్రమాదముంది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

విల్ జాక్స్ డేంజరస్ ప్లేయర్. ఇతను బ్యాటింగ్‌తోనే కాదు, బంతితోనూ అద్భుతాలు చేయగలడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో 176 స్ట్రైక్ రేట్‌తో 191 పరుగులు చేసి, మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకలా నిలిచాడు. బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నుంచి భారత బ్యాటర్లకు ముప్పు ఉంది. గింగిరాలు తిరిగే బంతులతో ముప్పుతిప్పలు పెట్టే రషీద్‌ను కాచుకోకపోతే ఇబ్బందులు తప్పవు. టీమిండియాపై అతడికి మెరుగైన రికార్డు ఉంది. ఈ వరల్డ్ కప్‌లోనూ 11 వికెట్లతో చెలరేగుతున్నాడు. మరో ప్లేయర్ సామ్ కరన్ గురించి చెప్పుకోవాలి. ఇతనికి ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడం.. స్లో బంతులతో బురిడీ కొట్టించడంలో సిద్ధహస్తుడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ సిక్సర్లతో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలడు. ఇంగ్లాండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నాడు. ఈ టోర్నీలో అతడు చేసిన పరుగులు 125 మాత్రమే చేసినా.. ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాడంటే స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే. సాల్ట్ ను పవర్‌ప్లేలోనే ఔట్ చేయకపోతే భారత్‌కు కష్టాలు తప్పవు. ఇంగ్లాండ్‌కు గొప్ప బలం ఆ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు. . సూపర్-8లో పాకిస్థాన్‌పై సెంచరీ బాదాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న బ్రూక్, సెమీస్ వంటి పెద్ద మ్యాచ్‌లో కీలకంగా మారనున్నాడు.

