మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ జోరు కొనసాగింది. తొలి మ్యాచ్‌లో లంకను చిత్తు చేసిన హర్మన్ సేన ఆదివారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను 88 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.
హర్లీన్ డియోల్ (46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో రిచా ఘోష్ (35 నాటౌట్) మెరుపులు మెరిపించింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమిన్ (81; 106 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు టీమిండియా బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కి క్యూ కట్టారు.
భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరో 3 వికెట్లతో విజృంభించగా.. స్నేహ్ రాణా 2 వికెట్లతో మెరిసింది. ఇక 9న జరిగే మ్యాచ్‌లో భారత అమ్మాయిలు దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనున్నారు.