Independent Sarpanch | ఎంబీఏ విద్యార్థి.. సర్పంచ్ అభ్యర్థిగా
Independent Sarpanch | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మండలంలోని వస్త్రంతండా గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్(Independent Sarpanch) అభ్యర్థిగా అఖిలను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలా మాట్లాడుతూ.. ఎంబీఏ పూర్తి చేసి కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ చదువుతూనే గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని అన్నారు.
చదువుకున్న విద్యార్థిని నని, గెలిపిస్తే తండాను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. తనను గెలిపిస్తే రైతులు పండించిన పంటలకు గ్రామంలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల(Food Processing Units)ను ప్రారంభిస్తామని, గ్రామైక్య సంఘాల ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తానని అన్నారు.
చదువుకున్న విద్యార్థులను ఉద్యోగ పోటీ పరీక్షల్లో రాణించేందుకు కంప్యూటర్ల ద్వారా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని అన్నారు. తండావాసులు ఆదరించి తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాల్సిందిగా ఆమె అభ్యర్థించారు.

