Independent | పోటాపోటీగా నామినేషన్లు దాఖలు

Independent | పోటాపోటీగా నామినేషన్లు దాఖలు

Independent | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు మండలంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీలకు సంబంధం లేకున్న, ఎన్నికలు జరుగుతున్నా గ్రామాల్లో కాంగ్రేస్, బీఆర్ఎస్, బీజేపీపార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్(Independent)గా పలువురు తమ నామినేషన్లు దాఖలు చేశారు.

తొలి రోజు మందకొడిగా నామినేషన్లు దాఖలైన రెండో రోజు మాత్రం ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో గ్రామాలు కోలాహాలంగా మారాయి. మండల కేంద్రంలో గురువారం ఒక రోజే పది మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించినా మండల కేంద్రంలో మాత్రం ఏ పార్టీ కూడ అభ్యర్థులను ప్రకటించలేదు.

అమీనాబాద్ గ్రామంలో మండల కాంగ్రేస్ పార్టీ(Congress Party) అధ్యక్షుడు సిద్దన రమేష్ వెంట రాగా కాంగ్రేస్ అభ్యర్థిగా దార రంజిత్ నామినేషన్ దాఖలు చేశారు. చెన్నారావుపేటలో రాధారపు నాగలక్ష్మిప్రతాప్ రెడ్డి నామినేషన్ దాఖలు(filing nominations) చేశారు. కాగా సాయంత్రం సమయం దాటినా కొన్ని క్లస్టర్ నామినేషన్ కేంద్రంలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడానికి లైన్లలో ఉన్నారు. కాగా ఆయా కేంద్రాల్లో పోలీసులు బందోబస్త్ నిర్వహించారు.

శుక్రవారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖాలయ్యే అవకాశం ఉంది. ఈ రోజు సర్పంచ్ స్థానాలకు 54, వార్డు సభ్యుల స్థానాలకు 184 నామినేషన్లు దాఖలైనట్లు మండల ఎన్నికల అధికారి,ఎంపీడివో వెంకట శివానంద్ తెలిపారు.

Leave a Reply