ప్రచారంలోనూ ఇండిపెండెంట్..

ప్రచారంలోనూ ఇండిపెండెంట్..
- తన పోస్టర్ తానే.. అతికించిన స్వతంత్ర అభ్యర్థి..
వైరా, ఆంధ్రప్రభ ; మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతోంది… రాజకీయాలపై ఆసక్తితో సేవ చేయాలనే సదుద్దేశంతో యువత కూడా రాజకీయాల వైపు ఆకర్షితులవుతున్నారు.. ఈ ఎన్నికల్లో యువత కూడా నామినేషన్లు దాఖలు చేశారు.. అవకాశం ఉన్నచోట్ల అధికార ప్రతిపక్ష పార్టీల బి ఫామ్ లపై పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో 25 ఏళ్ల యువకుడు వైరా మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదో వార్డులో వైయస్ఆర్సీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు అయితే ఒకవైపు అయన మైకు ద్వారా వార్డులో ఆటో రిక్షాలో ప్రచారం సాగుతోంది.. వార్డులో ప్రచారం నిర్వహిస్తున్న స్వతంత్ర అభ్యర్థి షేక్ యూసఫ్ ఖాన్ ఓ ఇంటి గోడ పై.. తన వాల్ పోస్టర్ లేకపోవడం చూసి..స్వయంగా తానే అతికించడంఓ ప్రత్యేకతను సంతరించుకుంది.. రాజకీయాల్లో చట్టసభల్లో తాము కూడా ఉండాలని.. ప్రజలకు సేవ చేయాలని.. ఆసక్తి పట్టుదల స్వయంగా వాల్ పోస్టర్ అతికించడంలో వ్యక్తం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు..
