సాంస్కృతిక కళా ప్రదర్శనలతో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం..

సాంస్కృతిక కళా ప్రదర్శనలతో స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారం..

ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థి చింత గాయత్రి గణేష్

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలోని 2 వ వార్డులో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి చింత గాయత్రీ గణేష్ మెయిన్ రోడ్డు వెంట వార్డులోని ఆయా కాలనీలలో ప్రచార చేశారు. ప్రచార వాహనంలో సంచరిస్తూ కళాకారుల ఆటపాటలతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తూ వినూత్నంగా ప్రచారం నిర్వహించడం ఆకట్టుకుంది.

తమకు గాజుల గుర్తు కేటాయించారని ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో 2 వ వార్డ్ ఓటర్లు, మహిళలకు సెంటిమెంటు అయిన గాజుల గుర్తుకు ఓటేసి తమను అత్యధిక మెజార్టీ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము నీతి, నిజాయితీగా పాలన అందించేందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరులోకి దిగామని, తాము ఏదో ఆశించి పోటీలోకి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన చింత గణేష్ కు పార్టీ టికెట్ రాకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

Leave a Reply