IND vs SA | మూడు ఫార్మాట్ల‌ పోర‌కు సన్నద్ధం..

  • స‌ఫారీల‌తో టీమిండియా షెడ్యూల్ ఇదే…

ఆంధ్ర‌ప్ర‌భ : ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. మరో బిగ్ వార్ (IND vs SA) కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో (southafrica tour of india) పర్యటించనుంది. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు జరిగే ఈ పర్యటనలో… రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) భారత టెస్ట్ జట్టు(Test Team)కు నాయకత్వం వహించనున్నాడు. రిషభ్ పంత్ (Rishabh Pant) వైస్-కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఆండర్సన్-తెండూల్కర్ ట్రోఫీ (Anderson–Tendulkar Trophy) తర్వాత పంత్‌కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.

IND vs SA | మూడు ఫార్మాట్ల‌ పోర‌కు సన్నద్ధం..

IND vs SA | లిమిటెడ్ ఓవర్ల బ్యాటిల్ – రోహిత్, కోహ్లీ ఎంట్రీ!

టెస్ట్‌ల తర్వాత భారత్–దక్షిణాఫ్రికా జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడతాయి. వన్డే సిరీస్ నవంబర్ 30న రాంచీ (Ranchi)లో ప్రారంభం కానుంది. ఈ ఫార్మాట్‌ (Format)‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) మళ్లీ జట్టులోకి (Comeback) రానున్నారు.

ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ (Retirement) ప్రకటించిన రోహిత్‌, కోహ్లీలు ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్‌ (ODI Format)‌లో మాత్రమే ఆడుతున్నారు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ (Australia ODI Series)‌లో వీరి పర్ఫార్మెన్స్‌ చూసిన అభిమానులు మళ్లీ వీరిని మైదానంలో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వీరు ఈ ఫార్మాట్‌ నుంచి కూడా పూర్తిగా రిటైర్‌ అయ్యే లోపు, రణరంగంలో (Battlefield) మరొకసారి వీరి ఆటను ఆస్వాదించాలని అభిమానుల కోరిక. దీంతో, సౌతాఫ్రికా‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో రోహిత్‌, కోహ్లీలు మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నారు. అయితే, వీరిద్దరూ టెస్ట్‌లు, టీ20 సిరీస్‌లకు దూరంగా ఉంటారు.

టీ20 సిరీస్ డిసెంబర్ 9న కటక్‌లోని బరాబటి స్టేడియం వేదికగా ప్రారంభమవుతుంది. భారత్‌లో జరగబోయే 2026 టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2026)కు ముందు ఈ సిరీస్ రెండు జట్లకూ కీలకంగా నిలవనుంది.

IND vs SA | భారత టెస్ట్ జట్టు (India Test Squad) :

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుధర్షన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్.

IND vs SA | దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు (South Africa Test Squad) :

టెంబా బవుమా (కెప్టెన్), కార్బిన్ బోష్, డేవాల్డ్ బ్రేవిస్, టోనీ డి జోర్జీ, జుబాయర్ హమ్జా, సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముతుసమీ, కగిసో రబాడా, రయాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెన్నీ.

IND vs SA | పూర్తి సిరీస్‌ షెడ్యూల్‌ (Full Series Schedule)

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్‌లో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

టెస్ట్‌లు (Tests) : మొదటి టెస్ట్ మ్యాచ్ (Test Match) నవంబర్‌ 14న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ (Eden Gardens) వేదికగా ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. రెండో టెస్ట్ నవంబర్‌ 22న గువాహటిలోని ఏసీఎ స్టేడియం (ACA Stadium)లో ఉదయం 9:00 గంటలకు జరుగుతుంది.

వన్డేలు (ODIs) : టెస్ట్ సిరీస్‌ తర్వాత మూడు వన్డే మ్యాచ్లు (ODIs) జరుగనున్నాయి. తొలి వన్డే నవంబర్‌ 30న రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియం (JSCA Stadium)వేదిక‌గా.. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభమవుతుంది. రెండో వన్డే డిసెంబర్‌ 3న రాయ్‌పూర్‌ (Raipur)లో, మూడో వన్డే డిసెంబర్‌ 6న విశాఖపట్నం (Visakhapatnam)లో అదే సమయానికి (మ. 1:30) జరగనుంది.

టీ20లు (T20Is) : ఇక‌, వన్డే సిరీస్ అనంతరం ఐదు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు (T20 Internationals) జరగనున్నాయి. తొలి టీ20 డిసెంబర్‌ 9న కటక్‌ (Cuttack)లోని బరాబతి స్టేడియం (Barabati Stadium)లో సాయంత్రం 7:00 గంటలకు ఆరంభమవుతుంది. రెండో టీ20 డిసెంబర్‌ 11న ముల్లన్‌పూర్‌ (Mullanpur)లో, మూడో టీ20 డిసెంబర్‌ 14న ధర్మశాల‌ (Dharamshala)లో, నాలుగో టీ20 డిసెంబర్‌ 17న లక్నో‌ (Lucknow)లో, ఐదో మరియు చివరి టీ20 డిసెంబర్‌ 19న అహ్మదాబాద్‌ (Ahmedabad)లో సాయంత్రం 7:00 గంటలకు జరుగుతుంది.

ఈ పర్యటనలో మూడు ఫార్మాట్లలోనూ పోటీలు జరగనున్నందున, రెండు జట్లకీ ఇది కీలకమైన సిరీస్‌గా మారనుంది.

IND vs AUS | టీ20 సిరీస్ టీమిండియా కైవసం (India Clinch T20I Series) …

ఇక‌, ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా విజయవంతంగా ముగించింది. సెప్టెంబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత్ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లలో పాల్గొంది. వన్డే సిరీస్‌(ODI Series)ను ఆస్ట్రేలియా 2-1 తేడాతో గెలుచుకోగా, టీ20 సిరీస్‌(T20 Series)ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

బ్రిస్బేన్ గబ్బా మైదానం(Gabba Stadium)లో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది (Abandoned). మ్యాచ్ ప్రారంభమైన కొద్ది సేపటికే వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. భారత్ 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసిన సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. చివరికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు (Called Off) చేసినట్లు అంపైర్లు ప్రకటించారు.

యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సిరీస్ మొత్తం అద్భుత ఫామ్‌లో కొనసాగి, 163 పరుగులు (Strike Rate 161.38)తో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు.

ఈ విజయంతో టీమిండియా లిమిటెడ్ ఓవర్ల పర్యటన(Limited Overs Tour)ను విజయవంతంగా ముగించి, ఇప్పుడు నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ (South Africa Test Series) కోసం సమాయత్తం (Ready for Battle)** అవుతోంది..

ఈ వార్త కూడా చదవండి IND vs AUS | మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం.. సిరీస్ భారత్ సొంతం…

ఆసీస్ పై భారత్ విజయం

Leave a Reply