భారత్, ఇంగ్లాండ్ మధ్య లండన్‌లోని ఓవల్ (Oval) గ్రౌండ్లో జరిగిన చివరి టెస్టు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ముగిసింది. ఈ మ్యాచ్‌లోను ఇంగ్లాండ్ (England) సునాయాసంగా గెలిచేస్తుంది అనుకున్నప్పటికీ.. భారత బౌలర్లు అద్భుతం చేశారు. టీమిండియా (Team India)ను 6 పరుగుల తేడాతో గెలిపించారు. టెస్టుల క్రికెట్ చరిత్రలోనే ఇంత తక్కువ తేడాతో గెలవడం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో 224 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది. వెటరన్ క్రికెటర్ కరుణ్ నాయర్ (Karun Nair) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను అగ్రెసివ్‌గా స్టార్ట్ చేసినా.. ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకొని.. ఇంగ్లండ్‌ను సైతం 247 పరుగులకే ఆలౌట్ చేశారు.
భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ (Siraj) 4, ప్రసిద్ధ్ (Prasidh) కృష్ణ 4 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు టీమిండియా 396 పరుగుల మంచి స్కోర్ చేసి.. ఇంగ్లాండ్‌కు ఫైటింగ్ టార్గెట్ ఇచ్చింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ 118, ఆకాశ్ దీప్ 66, రవీంద్ర జడేజా 53, వాషింగ్టన్ సుందర్53 పరుగులతో అద్భుతంగా ఆడాడు. అప్పటికీ ఇంగ్లాండ్‌కు కేవలం 35 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నాయి. అయినా కూడా భారత బౌలర్లు అద్భుతంగా పోరాడారు. భారత బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగాడు.