IND vs ENG | రేపే రెండో వన్డే.. సిరీసే టార్గెట్ !
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రేపు కటక్ వేదికగా రెండో వన్డే జరగనుంది. అయితే, తొలి వన్డేలో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన టీమిండియా ఇప్పుడు.. సిరీస్ ఏ లక్ష్యంగా బరిలోకి దిగనుంది.
నాగ్‌పూర్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో పర్యాటక ఇంగ్లండ్‌ను 4 వికెట్లతో చిత్తు చేసిన టీమిండియా కటక్ మ్యాచ్‌లోనూ గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ పట్టేయాలని చూస్తోంది.
గత మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కటక్ వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని రోహత్ సేన భావిస్తోంది.
మరోవైపు టీ20 సిరీస్ ను కోల్పోయి, వన్డే సిరీస్ నూ ఓటమితో ప్రారంభించిన ఇంగ్లిష్ జట్టు.. రెండో మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ లో నిలవాలని చూస్తోంది.
గత మ్యాచ్‌లో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నాడు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.