ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ప్రారంభం నుంచే రసవత్తరంగా మారింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో సిరీస్ 1-1తో సమానంగా నిలవగా… ఈ మ్యాచ్ గెలిచిన సిరీస్ లో ముందడుగు వేయాలనే కసి ఇరు జట్టు కసితో ఉన్నాయి. దీంతో నేటి ఆట మొదటి సెషన్ చివరికి ఇంగ్లండ్ 83 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి నిలిచింది.
ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లలో వరుసగా టాస్ గెలిచిన స్టోక్స్ ఈసారి కొంచెం ఆశ్చర్యంగా బాటింగ్ ఎంచుకున్నాడు. ఇక ఇరు జట్లకూ కీలక ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. జోఫ్రా ఆర్చర్ రాకతో ఇంగ్లాండ్ ఉత్సాహంగా ఉంది. భారత్‌కి ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి చేరడంతో బౌలింగ్ దళానికి గణనీయమైన బలం లభించింది.
ఇక బ్యాటింగ్ తొ బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఓపెనర్లను మొదటి గంటలో బుమ్రా, ఆకాష్ దీప్ లు బాగా పరీక్షించారు. తొలి గంటలోనే ఆతిథ్య జట్టు ఓపెనర్లను బుమ్రా, ఆకాష్‌దీప్ బాగా పరీక్షించారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు జాగ్రత్తగా ఆడుతూ… ప్రతి పరుగును కష్టపడి సంపాదించారు.
ఈ క్రమంలో ఇంగ్లండ్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోతున్నట్టు కనిపించిన టైమ్‌లో భారత్‌కి మలుపు తప్పింది. కెప్టెన్ శుభ్మాన్ గిల్ శార్ప్ గా బౌలింగ్ మార్పు చేసి యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కి అవకాశం ఇచ్చాడు. ఆ నిర్ణయం క్షణాల్లోనే ఫలితం ఇచ్చింది.
డ్రింక్స్ విరామం తర్వాత వచ్చిన నితీశ్ ఒక్క ఓవర్లోనే రెండు కీలక వికెట్లు తీశాడు. మొదట డకెట్ (23) ను వెనక్కు పంపగా.. అదే ఓవర్ చివరి బంతికి క్రాలీ(18) ని అద్భుత బంతితో ఔట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా ఇంగ్లండ్ 44/0 నుంచి 44/2కి పడిపోయింది.
భారత్ మరో బిగ్ వికెట్ కోసం ప్రయత్నించింది కానీ, అనుభవజ్ఞులు జో రూట్ (24) – ఓలీ పోప్ (12) జాగ్రత్తగా ఆడుతూ 39 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా లంచ్ సమయానికి ఇంగ్లండ్ 83/2తో నిలిచింది.
ఇప్పటివరకు నితీశ్ కుమార్ రెడ్డి 2/19తో భారత్‌కి కీలక బ్రేక్ త్రూ ఇచ్చాడు. బుమ్రా, ఆకాష్ దీప్ లకు ఇంకా వికెట్ దొరకలేదు కానీ, కండిషన్స్ తోడైతే మరో సెషన్‌లో వికెట్లు తీసే అవకాశం ఉంది. రూట్, పోప్ జాగ్రత్తగా ఆడుతున్నప్పటికీ భారత్ ఇంకో వికెట్ తీయగలిగితే మళ్లీ పైచేయి సాధిస్తుంది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.
లంచ్ సమయానికి స్కోరు:
ఇంగ్లండ్ : 83/2 (25 ఓవర్లు)
(జో రూట్ 24, ఓలీ పోప్ 12)
భారత్ : (నితీశ్ కుమార్ రెడ్డి 2/15)**