ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. సంచలనాత్మక ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించిన యువ భారత కెప్టెన్…. 311 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్సర్లతో 200* డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్ 121.1 ఓవర్లలో 472/6తో నిలకడగా కొనసాగుతోంది.
ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో, టెస్ట్‌లలో తొలి డబుల్ సెంచరీ సాధించిన గిల్… 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.
ఇంగ్లండ్‌లో గడ్డపై డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లు:
- సునీల్ గవాస్కర్ – 221 (ది ఓవల్, 1979)
- రాహుల్ ద్రావిడ్ – 217 (ది ఓవల్, 2002)
- శుభ్‌మన్ గిల్ – 200* (ఎడ్జ్‌బాస్టన్, 2025)
23 సంవత్సరాల అనంతరం ఈ అరుదైన మైలురాయిని శుభ్‌మన్ గిల్ అధిగమించాడు.
టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్లు:
- మన్సూర్ అలీ ఖాన్ పటౌడి
- సునీల్ గవాస్కర్
- సచిన్ టెండుల్కర్
- ఎంఎస్ ధోని
- విరాట్ కోహ్లీ (6 సార్లు)
- శుభ్‌మన్ గిల్*
భారత ఇన్నింగ్స్‌కు దృఢ పునాది
మధ్యలో వికెట్లు పడిపోవడంతో ఒత్తిడిలోకి వెళ్లిన భారత జట్టును గిల్ – జడేజా జోడీ (200 పరుగుల భాగస్వామ్యం) నిలబెట్టింది. అనంతరం వాషింగ్టన్ సుందర్ దూకుడుగా ఆడి, గిల్‌కు చక్కటి మద్దతుగా నిలిచాడు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 74 బంతుల్లో 58 పరుగులు (గిల్ – 34, సుందర్ – 24) జోడించారు. దీంతో భారత్ భారీ స్కోర్ వైపు దూసుకుపోతోంది.
ప్రస్తుత స్కోరు:
భారత్ – 472/6 (121.1 ఓవర్లు)
శుభ్‌మన్ గిల్ – 200*
వాషింగ్టన్ సుందర్ – 24*