ఇంచార్జీ వ్యవసాయ శాఖాధికారి నియామకం

ఇంచార్జీ వ్యవసాయ శాఖాధికారి నియామకం
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల ఇన్చార్జి వ్యవసాయ శాఖ అధికారి(ఎం.ఎ.ఓ)గా దండేపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి గొర్ల అంజిత్ కుమార్(Gorla Anjit Kumar)ను నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పని చేసిన మండల వ్యవసాయ శాఖ అధికారిణి సంగీత ఇన్(Sangeeta, in service) సర్వీస్ కింద పీజీ చదువుకోవడానికి రెండేళ్ల పాటు సెలవుపై వెళ్ళినందున ఆమె స్థానంలో దండేపల్లి అధికారిని నియమించారు.
ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం ఆయన మాట్లాడుతూ.. ఎరువులు, విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువుల, విత్తనాల షాపుల్లో(Fertilizer, Seed Shops) నాణ్యమైన ఎరువులు, విత్తనాలు విక్రయించాలని, కల్తీ, నకిలీ ఎరువులు, విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకొనున్నట్లు ఆయన తెలిపారు.
