కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
మంత్రాలయం, అక్టోబర్ 22 (ఆంధ్రప్రభ): దేశంలో రెండో తిరుపతిగా పేరుగాంచిన మంత్రాలయం (Mantralayam) శ్రీ రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక రాష్ట్రం కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DKShivakumar) దర్శించుకున్నారు. ఆయనకు శ్రీరాఘవేంద్ర స్వామి మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు.

ముందుగా ఆయన మంచాలమ్మ దేవిని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు శాలువాలతో సత్కరించి ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. వెంట మఠం సిబ్బంది, రాయచుర్ జిల్లా ఎస్పీ ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవ్, తహసీల్దార్ రమాదేవి,మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్ఐ లు తదితరులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) ఈ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె. శివకుమార్, మంత్రి బోసురాజు తదితరులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి లకు రాఘవేంద్ర స్వామి మఠం(Raghavendra Swamy Math) అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందజేశారు.