శ్రీశైలం ముస్తాబులో

శ్రీశైలం ముస్తాబులో

  • అధికారులు బిజీబిజీ

నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(The Illusionary Mallikarjuna Swamy) దర్శనార్థం వస్తున్నారు. ఢిల్లీలో మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu), ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని శ్రీశైలం రావాలని ఆహ్వానించారు. అక్టోబర్ 16 న శ్రీశైలం పుణ్యక్షేత్రానికి రానున్నతరుణంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది.

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పురావస్తు శాఖ అధికారుల(officials)కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు పురావస్తు శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ప్రధానమంత్రి రాక సందర్భంగా శ్రీశైలం దేవస్థానం చరిత్రను తెలిపే రీతిలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. క్రీస్తుశకం 13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు లభించిన 20 తామ్ర శాసనాల ఆనవాళ్లను ప్రదర్శించనున్నారు.

79 రాగి రేకులపై ఐదు రకాల భాషల్లో రాసిన శాసనాలను కూడా ప్రదర్శించనున్నారు. ఆనాడు శ్రీశైలం దేవస్థానంపై దాడి ఎలా జరిగింది తిరిగి పునరుద్ధరణ కార్యక్రమం ఆలయాల జీవనోద్ధరణ కార్యక్రమాలు తదితర అంశాలను కూడా ఇందులో పొందుపరిచారు. శ్రీశైలం చారిత్రాత్మక ప్రాధాన్యతను కూడా వివరించనున్నారు. శాసనాలలో 13వ శతాబ్దంలో హాలీ తోకచుక్క(Halley’s comet) భూమిపై పడిన ఉదంతాలను, ఆనాడు ఏర్పడిన ఉల్పాపాతం ఘటనలను కూడా ప్రధానికి వివరించనున్నారు.

శ్రీశైలం దేవస్థానంలో తామ్ర పత్రాల గురించి ఆనాటి ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం(Muniratnam) రాసిన హార్ట్ అఫ్ కాపర్ ప్లేట్స్ శ్రీశైలం అనే పుస్తకాన్నికూడా ప్రధానమంత్రి ఆవిష్కరించనున్నట్లు పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. 2021 లో ప్రస్తుత దేశ హోంమంత్రి అమిత్ షా(Amit Shah) కూడా శ్రీశైలం పర్యటనకు వచ్చినప్పుడు తామ్ర పత్రాలను రాగి రేకుల విషయాలను గురించి ఆనాటి శతాబ్దంలో జరిగిన ఘటనలు గురించి వివరించారు.

Leave a Reply