ADB | మహా కుంభమేళాలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
ఉట్నూర్, ఫిబ్రవరి 21 (ఆంధ్రప్రభ) : ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో 144 సంవత్సరాలకొకసారి వచ్చే మహా కుంభమేళా త్రివేణి సంగమంలో శుక్రవారం ఉదయం బీఆర్ఎస్వీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ డీఆర్ఎస్ నాయకులు పాల్గొని త్రివేణి సంఘంలో స్నానాలు చేసి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) చిత్రపటానికి క్షీరాభిషేకం చేసినట్లు టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షులు ధరిణి రాజేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ధరణి రాజేష్ మాట్లాడుతూ… కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో బాగుండాలని తెలుపుతూ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం అక్కడి దేవాలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన్నట్లు ఆయన పేర్కొన్నారు.