Illendu | ప్రమాణ స్వీకారోత్స‌వం

Illendu | ప్రమాణ స్వీకారోత్స‌వం

  • పదవి బాధ్యతలు చేపట్టిన కొత్త సర్పంచులు

ఇల్లెందు, ఆంద్రప్రభ : పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల చేత ఈ రోజు ఆయా పంచాయతీ కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 11 గంటలకు మండలంలోని 29 పంచాయతీలలో ఏకకాలంలో ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ.. ప్రజలు తమపై నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పాలన అందిస్తామన్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply