Illegally | అక్రమంగా ఇసుక తరలింపు..

Illegally | అక్రమంగా ఇసుక తరలింపు..
ఫేక్ బిల్లులతో ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత..
రూ.1.5 లక్షల అక్రమ ఇసుక..
Illegally | జన్నారం,ఆంధ్రప్రభ: ఫేక్ బిల్లుతో ఇసుక తరలిస్తున్న టిప్పరును మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందనపల్లి ఫారెస్ట్ చెక్కు పోస్ట్ వద్ద అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. అటవీశాఖ ఉన్నత అధికారుల సమాచారం మేరకు ఇందనపల్లి గ్రామ సమీపాన ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద తమ ఫారెస్ట్ సెక్షన్,బీట్ ఆఫీసర్లు హన్మంతరావు, రవికుమార్, పోచయ్యలతో పాటు తాను నకిలీ వేబిల్లుతో తరలిస్తున్న టీఎస్ 04యూబీ 8546 నెంబరు గల ఇసుక టిప్పరును పట్టుకున్నట్లు ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గోదారి లక్ష్మీనారాయణ తెలిపారు.
పట్టుకున్న టిప్పర్ లోని ఇసుక విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు.ఆ టిప్పర్ నిర్మల్ జిల్లా ఉడుంపూర్ కు చెందిన కాసవేని విజయ్ దని ఆయన చెప్పారు.ఆ టిప్పరుపై కేసు నమోదు చేసి,సీజ్ చేసి రేంజులో పెట్టామని ఆయన వివరించారు.
