అక్రమ నిల్వలు

  • రసాయన పదార్థాలు సీజ్


ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా (Sangareddy district) గడ్డపోతారం పులిగిల్లా ఫంక్షన్ హాల్ లో అక్రమంగా నిల్వ చేసిన రసాయన పదార్థాలను డ్రగ్స్, నార్కోటిక్, సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. ఈ రోజు ఉదయం ఫంక్షన్ హాల్ పై దాడి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ చేసిన రసాయన కెమికల్ డ్రమ్ములు వారు స్వాధీనం చేసుకున్నారు. అవి హీటిరో పరిశ్రమకు చెందినవిగా అధికారుకు గుర్తించినట్లు సమాచారం. ఐడీఏ బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply