జామియా మస్జీదులో ఇఫ్తార్ విందు..

జామియా మస్జీదులో ఇఫ్తార్ విందు..
అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఏడో వార్డులోని జామియా మస్జీదులో రంజాన్ సందర్భంగా మంగళవారం రాత్రి కూటమి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ ముఖ్య అతిధులుగా విచ్చేసి ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం ఉపవాస దీక్షపరులకు ఇఫ్తార్ విందు భోజనాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు వారిని ఘనంగా సత్కరించారు. కూటమి ముస్లిం నాయకులు షేక్ బాబావలి, మొగల్ మురాద్ బేగ్, షేక్ గౌస్ (కాటమ), షేక్ ఖలీల్, షేక్ బషీర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, లంకమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ అన్నపరెడ్డి వెంకటస్వామి, ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను, కటికల వసంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, కూటమి నాయకులు కొల్లూరి ఇమ్మానియేల్, అవనిగడ్డ ప్రకాశం, లుక్కా పిచ్చియ్య, మండలి రామ్మోహనరావు, కోసూరు అవినాష్, కొల్లూరి వాసు, లుక్కా శ్రీను, కమతం నరేష్, కంచర్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
