మార్చి 18 రాష్ట్ర వైసీపీ అధికారిక ఇఫ్తార్ విందు

మార్చి 18 రాష్ట్ర వైసీపీ అధికారిక ఇఫ్తార్ విందు

రాష్ట్ర వైసిపి కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా

భవానిపురం, ఆంధ్రప్రభ : మార్చి 18 బుధవారం సాయంత్రం 5 గంటలకు బందర్ రోడ్ లో వైవి రావు హాస్పటల్ రోడ్డు ఎస్ ఎస్ కళ్యాణ మండపం నందు వైసీపీ అధికారిక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైసిపి కార్యదర్శి మైనారిటీ బాజీ బాబా మంగళవారం మీడియా ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఉన్న వైసిపి నాయకులు పాల్గొంటారని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ ఉపవాస దీక్ష విరమణ రాష్ట్రంలో మౌలానాలకి ,ఇమామ్లకి, రాష్ట్ర వైసిపి మైనారిటీ నాయకులకు,కార్యకర్తలకు అందరికీ ఇఫ్తార్ విందుకు ఆహ్వాని, అందరం ఒకటిగా అందరం సోదర భావంతో మెలగాలనే ఆలోచనతోనే ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.

సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందించడమే రంజాన్ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.అందువల్ల మైనార్టీ సోదరులు ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారన్నారు.అలాగే ముస్లిం సోదరులందరూ ఎంతో నిష్టగా ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ అల్లామన్ననలు పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ పవిత్రతను గుర్తించి అల్లా అనుసరించిన మార్గంలో నడవాలన్నారు.

Leave a Reply