భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే..

భద్రాచలం శ్రీరామనవమి వేడుకకి వెళితే..

భద్రాచలం (టౌన్) ఆంధ్రప్రభ : శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి కళ్యాణం వీక్షించడానికి కొందరు యువకులు భద్రాచలం విచ్చేయగా స్నానాలు ఆచరించడానికి బోటు సహకారంతో గోదావరిలోని అవతలి ఒడ్డుకు వెళ్లారు. స్నానాలు ఆచరిస్తున్న క్రమంలో ఒక యువకుడు గల్లంతు అవుతుండగా, అతనితో ఉన్న స్నేహితులు కేకలు వేస్తుండడంతో… గమనించిన స్మిమ్మర్ ప్రసాద్ చాకచక్యంగా యువకుడిని ఒడ్డుకు చేర్చాడు.

అప్పటికే ఆ భక్తుడు ఉలుకుపలుకు లేకుండా పడి ఉండడంతో సిమ్మరు ప్రసాద్ తెలివిగా సిపిఆర్ చేస్తూ బోటు సహకారంతో ప్రధమ చికిత్స కేంద్రానికి తీసుకువెళ్లాడు. స్థానిక వైద్యులు చికిత్స అందించడంతో భక్తుడికి ప్రాణ గండం తప్పింది. సమయానికి సిపిఆర్ చేసి ప్రధమ చికిత్స కేంద్రానికి తరలించిన గజ ఈతగాడు ప్రసాదుని వైద్యులతో పాటు స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply