MONKEY| నందివాడ, ఆంధ్రప్రభ : నందివాడలో ఇటీవల కోతుల బెడద విపరీతంగా పెరగడంతో ప్రజలు బాగా ఇబ్బందులు పడ్డారు. కోతులు ఇళ్ల పై చేరడం, పిల్లలను భయపెట్టడం, ప్రయాణికులను ఆటంకపరచడం వంటివి జరగడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా, ఓ వ్యక్తి చింపాంజీ వేషధారణ ధరించి కోతులను తరిమివేశారు. ఈ వినూత్న ప్రయత్నం కారణంగా కోతుల సంచారం కొంత వరకు తగ్గినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. కోతుల సమస్యను పరిష్కరించేందుకు కొత్త ఆలోచనతో పరిష్కారం కొనుగొన్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు నందివాడ వాసులను అభినందిస్తున్నారు.
MONKEY| నువ్వు చింపాంజీవి అయితే.. మరి నేను?

