ఇల్లు కట్టకపోతే రద్దు

- త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు
ఉట్నూర్ (ఆదిలాబాద్ జిల్లా) : ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇల్లు సకాలంలో కట్టకపోతే రద్దు చేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఈరోజు కేబీ కాంప్లెక్స్‌లోని జరిగిన ఆదివాసులు సమావేశంలో 960 మంది గిరిజనులకు ఇందరమ్మ ఇళ్లు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మొదటి విడత కింద ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing) మంజూరైన వారు త్వరితగితన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్టర్ల ద్వారా నిర్మించిన ఇల్లు నాణ్యతా పాటించేలా చూడాలన్నారు. నాణ్యత లేకుంటే బిల్లులు నిలిచిపోతాయని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా (ITDA PO Khushboo Gupta), ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజు మర్మట్, ఆదిలాబాద్ సీఈవో జితేందర్ రెడ్డి, పివిటిజి ఏపీఓ మెస్రం మనోహర్, కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ యూత్ ఇంచార్జ్ ఆత్రం రాహుల్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ లింగంపల్లి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
