నాలాలను కాపాడకపోతే నిరసనలు తప్పవు

నాలాలను కాపాడకపోతే నిరసనలు తప్పవు

నారాయణపేట, ఆంధ్రప్రభ ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రధాన నాలను ముసివేస్తూ పనులు కొనసాగుతున్నా ఆ వైపు అధికారులు(Officers) కన్నెత్తి చూడ‌కపోవడంతో అధికారులు పనితీరుపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పనులు పాలకులు, అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా స్పందన లేకపోవడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు.

నాలాను మూసివేస్తే వరద నీటితో మునిగే ప్రమాదం

ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ నాలా, పట్టణంలో అనేక గృహాలు, వరద నీటి ప్రవాహానికి ముఖ్యమైన మార్గంగా ఉంది. దీనిని మూసివేయడం వల్ల వర్షాకాలంలో నీరు నిలిచిచే అవకాశం ఉంది. దింతో సమస్యలు పెరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం(State Govt) నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ, నాలాల్లో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్న తరుణంలో, జిల్లా కేంద్రంలోనే నాలాల‌ను మూసివేస్తుండటం ఆశ్చర్యకరం అని ప్రజలు అంటున్నారు. నాలాను రక్షించమని చెబుతున్నా ప్రభుత్వం, జిల్లా కేంద్రంలో ముసివేస్తున్న అధికారులు చోద్యం ఎందుకు చూస్తున్నారు అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ముసివేస్తున్న నాల పనులను ఆపి నాలల‌ను పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు. ప్రజా సౌకర్యాలను కాపాడడం అధికారులు, మునిసిపల్ విభాగం బాధ్యత అని గుర్తుచేస్తూ, “నాలాలను కాపాడకపోతే నిరసనలు తప్పవు” అని హెచ్చరిస్తున్నారు.
ఈ విషయామై నీటి పారుదల డిప్యూటీ ఇ శ్రీనివాస్(Deputy E Srinivas)ను వివరణ కోరగా నాలల‌ను పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

Leave a Reply