Pension | చంద్రబాబు మాట ఇస్తే..

Pension | చంద్రబాబు మాట ఇస్తే..


Pension | టంగుటూరు, ఆంధ్రప్రభ : టంగుటూరు మండలం శివపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి డీఎస్ బీవీ స్వామి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సామాజిక ఫించన్ల కోసం పేదలకు 17 నెలల్లో రూ. 50,773 కోట్లు అందజేశామని… ఇది దేశంలోనే అతి పెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమమని చెప్పారు. ఏడాదికి వృద్ధాప్య పింఛనుదారులకు రూ.48 వేలు, డయాలసిస్ (Dialysis) రోగులకు రూ.1.20 లక్షలు, మంచానికి పరిమితమైన దీర్ఘకాలిక రోగులకు రూ.1.80 లక్షల చొప్పున అందిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రం ఇంత పెద్ద మొత్తంలో పింఛన్లు ఇవ్వడం లేదు అన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన వారందరికీ పింఛన్లు అందజేస్తున్నామని.. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. పింఛన్ల పెంపు పై మాట తప్పి వృద్ధులను సైతం మోసం చేసిన ఘనుడు జగన్ రెడ్డి అని… సీఎం చంద్రబాబు నాయుడు మాట ఇస్తే.. నిజం చేసి చూపిస్తారని మంత్రి డీఎస్ స్వామి అన్నారు.

Leave a Reply