MONEY | ఆదర్శం.. ఆటో డ్రైవర్..

MONEY | ఆదర్శం.. ఆటో డ్రైవర్..

MONEY | నర్సింహులపేట, ఆంధ్రప్రభ : ఓ ప్రయాణికుడు మరచిపోయిన డబ్బులను తిరిగి అప్పగించి నిజాయితీని చాటుకున్నాడు ఆటో డ్రైవర్ రవి. మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) నర్సింహులపేట మండల కేంద్రం నుండి వరంగల్ – ఖమ్మం క్రాస్ రోడ్డు వరకు ఎర్ర రవి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఓ వృద్ధుడు అతని ఆటోలో ప్రయాణించే సమయంలో డబ్బులు, మందులు, బట్టలు ఉన్న కవర్ ను మరచిపోయాడు. జయపురం గ్రామానికి చెందిన సుక్క రాంచంద్రయ్యను గుర్తించి అందులో ఉన్న రూ.1140ల నగదు, మందులు, బట్టలు ఉన్న కవర్ ను సురక్షితంగా తిరిగి ఇచ్చేశాడు. నిజాయితీగా అప్పజెప్పిన ఆటో డ్రైవర్ రవిని మండల ప్రజలు అభినందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రవిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Leave a Reply