Icon Star | పుష్ప 3 స్టార్ట్ చేసేది ఎప్పుడు..?

Icon Star | పుష్ప 3 స్టార్ట్ చేసేది ఎప్పుడు..?
Icon Star | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పుష్ప ఓ సంచలనం.. పుష్ప 2 ఓ చరిత్ర. ఈ రెండు సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే.. పుష్ప 2 ఎండింగ్ లో పుష్ప 3 ఉందని అనౌన్స్ చేశారు. ఇక అక్కడ నుంచి పుష్ప 3 ఎప్పుడు ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది. బన్నీ.. ప్రస్తుతం అట్లీతో మూవీ చేస్తున్నారు. నెక్ట్స్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanakaraj) తో మూవీని చేస్తున్నట్టుగా ప్రకటించారు. మరి.. పుష్ప 3 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది..?

పుష్ప, పుష్ప 2 సినిమాలతో ఐకాన్ స్టార్ (Icon Star) ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగారు. పుష్ప 2 ను ఇప్పుడు జపాన్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ కూడా పుష్ప రాజ్ కు అనూహ్య స్పందన వస్తుంది. ఈ మూవీ ప్రీమియర్స్ కు సైతం ఐకాన్ స్టార్ హాజరయ్యారు. దీంతో పుష్ప 3 అనేది మరోసారి తెర పైకి వచ్చింది. ప్రస్తుతం అట్లీతో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ జూన్ లేదా జులైకు కంప్లీట్ అవుతుంది. ఆతర్వాత ఆగష్టు నుంచి లోకేష్ కనకరాజ్ తో మూవీని సెట్స్ పైకి తీసుకురానున్నారని టాక్ వినిపిస్తోంది.

మరి.. పుష్ప 3 ఎప్పుడు అంటే.. సుకుమార్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేస్తారనేది క్లారిటీ లేదు కానీ.. పుష్ప 3 చేసే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఇన్ సైడ్ న్యూస్ ప్రకారం.. పుష్ప 3 కోసం హైదరాబాద్ లో ఆఫీస్ తీసారట. స్క్రిప్ట్ వర్క్ కు సంబంధించి కథా చర్చలు సూపర్ స్పీడ్ లో జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. బన్నీ, సుక్కు వీళ్లిద్దరూ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత పుష్ప 3 ని పట్టాలెక్కించనున్నారని తెలిసింది. ఏది ఏమైనా.. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

