IAEA | అణుకేంద్రంపై దాడి

IAEA | అణుకేంద్రంపై దాడి

రేడియేషన్ లీకేజీ జరగలేదు

IAEA | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్‌లోని నటాన్జ్ అణు కేంద్రంపై దాడి జరిగినట్లు అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) అధికారికంగా ధృవీకరించింది. అణు కేంద్రం ప్రాంగణంలోని కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని IAEA తెలిపింది. అయితే రేడియేషన్ లీకేజీ జరగలేదని, ప్రస్తుతం స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని సంస్థ స్పష్టం చేసింది.

ఈ దాడి ఇరాన్ అణు కార్యక్రమంపై ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుని చేపట్టినదని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామం మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ భయాలను మరింత పెంచే అవకాశం ఉంది.

Leave a Reply