జగన్మాతను వేడుకున్నా
- ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్
విజయవాడ , ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు(Nara Chandrababu Naidu) సంపూర్ణ ఆయురారోగ్యాలు జగన్మాత ప్రసాదించాలని దుర్గమ్మ(Durgamma) తల్లిని వేడుకున్నానని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస(Amudalavalasa) నియోజకవర్గం శాసనసభ్యులు కూన రవికుమార్(Ravikumar) అన్నారు.
లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలోని దుర్గమ్మను విజయవాడ(Vijayawada)లో ఆయన శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, శేష వస్త్రం అందజేశారు. అనంతరం మీడియా(Media) పాయింట్లో రవికుమార్ మాట్లాడుతూ, జగన్మాత అనుగ్రహం రాష్ట్ర ప్రజలపై ఉండాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి పార్టీ(Kotami Party)ల మధ్య సమన్వయంతో నిర్వహిస్తున్నఈ ప్రభుత్వం నవశకానికి నాంది పలుకుతుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య, ఆరోగ్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో అద్భుత అభివృద్ధి జగన్మాత(Jagan Mata) అనుగ్రహంతో లభించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు…