Hydra | చెరువుల ఆక్రమణల కూల్చివేత..

Hydra | చెరువుల ఆక్రమణల కూల్చివేత..
ఆంధ్రప్రభ వరుస కథనాలకు స్పందన..
స్థానికుల హర్షం..
Hydra | అల్వాల్, ఆంధ్రప్రభ : అల్వాల్ సర్కిల్ లో హైడ్రా పంజా విసిరింది. ఇక్కడి కొత్త చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో పెద్ద ఎత్తున వెలసిన ఆక్రమణల కూల్చివేత పనులను హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టారు. మంగళవారం హైడ్రా ఇన్ స్పెక్టర్ మల్లేశ్వర్ నేతృత్వంలో కూల్చివేత పనులను నిర్వహించారు. కాగా అల్వాల్ సర్కిల్ పరిధిలోని చెరువులకు సంబంధించి ఆంధ్రప్రభలో వరుస కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో వెలసిన ఆక్రమణలను ఈ కథనాల్లో వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఫలితంగా ఇవాళ హైడ్రా ఆక్రమణల కూల్చివేత పనులను చేపట్టడం పట్ల స్థానికంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.





