హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం మే 1తో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఖాళీ భర్తీకి ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ నెల 28న నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. 25న ఫలితాలు లెక్కించనున్నట్లు ఈసీ వెల్లడించింది. హైదరాబాద్ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ ప్రకటించింది. మార్చి 28న నోటిఫికేషన్ విడుదలకానుంది. ఏప్రిల్ 4 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అదే నెల 7న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువు ఉంటుంది. అదే నెల 23న పొలింగ్ నిర్వహించనున్నారు. 25న ఫలితాలు ప్రకటిస్తారు.
నోటిఫికేషన్ రిలీజ్: 28 మార్చి 2025
నామినేషన్ కు ఆఖరి తేది: 4 ఏప్రిల్ 2025
నామినేషన్ల పరిశీలన: 7 ఏప్రిల్ 2025
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు గడువు: 9 ఏప్రిల్ 2025
పోలింగ్ తేదీ: 23 ఏప్రిల్ 2025
ఓట్ల లెక్కింపు: 25 ఏప్రిల్ 2025