నిమ‌జ్జ‌నోత్స‌వ వేళ‌ మెట్రో స‌ర్వీసులు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లో రేపు గణేశ్ విగ్ర‌హాల (Ganesh Statues)ను నిమజ్జనం చేయ‌నున్నారు. ఈ వేడుక‌ను కనులారా వీక్షించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ మెట్రోరైలు (Metro Rail) సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన మొదటి రైలు ఉదయం 6గంటలకు మొదలుకుని అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి సెప్టెంబర్ 7వ తేదీ తెల్లవారు జామున 1 గంటకు చివరి రైల్ బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఆర్టీసీ అదనపు బస్సు స‌ర్వీసులు
మరోవైపు తెలంగాణ ఆర్టీసీ (Metro Rail) అదనపు బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఇక దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) నగరవాసులకు గుడ్​ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఎంఎంటీఎస్​ (MMTS) అదనపు ట్రిప్పులను తిప్పనున్నట్లుగా వెల్లడించింది. నిమజ్జనం రోజు నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్​ సర్వీసులకు నడిపిస్తామని అధికారులు తెలిపారు.

Leave a Reply