HYD | మెట్రో సేవలకు అంతరాయం..

HYD | మెట్రో సేవలకు అంతరాయం..

HYD | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమైన రవాణా వ్యవస్థ అయిన మెట్రో సేవలకు ఇవాళ ఉదయం అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీస్ సమయానికి ముందే ఈ అంతరాయం ఏర్పడటం వల్ల పలువురు ఆందోళనకు గురయ్యారు.

నాగోల్‌-రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలు సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయాయి. దాదాపు 10 నిమిషాల పాటు రైళ్లు కదలకపోవడంతో ప్రయాణికులు స్టేషన్లలోనే నిలిచిపోయారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన మెట్రో సిబ్బంది వెంటనే మరమ్మత్తు పనులు ప్రారంభించారు.

Leave a Reply