HYD | ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం…

HYD | ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం…
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1, 2, 3 పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేసే బల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్ (సీటీ)ల స్థానంలో కొత్తవి అమర్చుటకు నాసర్లపల్లి జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కెవి సబ్ స్టేషన్లకు ఈనెల 26న బుధవారంనాడు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు, 6 గంటల పాటు టీజీ ట్రాన్స్ కో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది.దీంతో ఈనెల 26న బుధవారం రోజున జలమండలి సరఫరా చేసే కృష్ణా ఫేజ్ -1,2, 3 లలో కింద పేర్కొన్న డివిజన్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ఒక ప్రకటనలో తెలిపింది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు…
ఓఅండ్‌ఏం డివిజన్ నం-1: చార్మినార్ 2. ఓఅండ్‌ఏం డివిజన్ నం-2: వినయ్ నగర్3. ఓఅండ్‌ఏం డివిజన్ నం-3: బొజగుట్ట 4. ఓఅండ్‌ఏం డివిజన్ నం-4: రెడ్ హిల్స్5. ఓఅండ్‌ఏం డివిజన్ నం-5: నారాయణ గూ6. ఓఅండ్‌ఏం డివిజన్ నం-6: ఎస్‌ఆర్ నగర్7. ఓఅండ్‌ఏం డి విజన్ నం-7: మారేడ్ పల్లి 8. ఓఅండ్‌ఏం డివి జన్ నం-8: రియాసత్ నగర్9. ఓఅండ్‌ఏం డివిజన్ నం-9: కూకట్ పల్లి10. ఓఅండ్‌ఏం డివిజన్‌నం-10: సాహె బ్ నగర్ 11. ఓఅం డ్‌ఏం డివిజన్ నం-11: హయత్ నగర్ 12. ఓఅ ండ్‌ఏం డివిజన్ నం-13: సైనిక్ పురి 13. ఓఅండ్‌ఏం డివిజన్ నం-14: ఉప్పల్ 14. ఓఅండ్‌ఏం డివిజన్ నం-15: హఫీజ్ పేట్ 15. ఓఅండ్‌ఏం డివిజన్ నం-16: రాజేంద్ర నగర్ 16. ఓఅండ్‌ఏం డివిజన్ నం-18: మణికొండ 17. ఓఅండ్‌ఏం డివిజన్ నం-19: బోడుప్పల్ 18. ఓఅండ్‌ఏం డివిజన్ నం-20: మీర్‌పేట్ డివిజన్ ప్రాంతాలు.
కాబట్టి నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని జలమండలి అధికారులు విజ్ఞప్తి చేశారు.
