హైదరాబాద్ : నర్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూవీ టవర్ సమీపంలో ఓ కారు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉండగా… ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మృతులను పోర్టు మార్టంకు తరలించారు.
కాగా, కారులో ప్రయాణిస్తున్న విద్యార్థులు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న.. వివేక్ రెడ్డి, సృజన్, కార్తికేయ, హిమ్ సాయి, శ్రీకర్ మరియు హర్షవర్ధన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.