Hyd | ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం !

హైదరాబాద్ లో ఈరోజు సాయంత్రం ప‌లు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో ఉద‌యం నుంచి ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులు వర్షంతో పాటు చల్లని గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉపశమనం ల‌భించిన‌ట్టైంది.

అయితే, ఆఫీసుల నుంచి తిరిగి వస్తున్న సమయంలో వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు కొన్ని చోట్ల ట్రాఫిక్ సమస్యలు ఎదుర‌వుతున్నాయి. కాగా, సాయంత్రం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply