HYD | ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

HYD | ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..

HYD | హైదరాబాద్, ఆంధ్రప్రభ : కట్టుకున్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య, తన సుఖానికి అడ్డు వస్తున్నాడని కడతేర్చింది. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్తను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన ఘటన హైదరాబాద్‌లోని (Hyderabad) నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్‌లో కలకలం రేపింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన నారాయణ్‌ బెహరా, బంధిత బెహరా దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు. నారాయణ్‌ ప్లంబర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరు ఉంటున్న ఇంట్లోనే విద్యాసాగర్‌ అనే యువకుడు కూడా అద్దెకు ఉంటున్నాడు.

ఈ క్రమంలో భార్య బంధితకు, విద్యాసాగర్‌కు మధ్య పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత నాలుగు నెలలుగా వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం భర్త నారాయణ్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తమ ఏకాంతానికి భర్త అడ్డుగా మారాడని భావించిన బంధిత, ప్రియుడు విద్యాసాగర్‌తో (Vidyasagar) కలిసి అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం నారాయణ్‌పై ఇనుప రాడ్డుతో దాడి చేసి హత్య చేశారు. పోలీసులు నారాయణ్‌ మృతిపై అనుమానంతో భార్య బంధితను అదుపులోకి తీసుకుని విచారించగా తనే ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు నిజం ఒప్పుకుంది. హత్య జరిగిన 24 గంటలలోపే నిందితులు బంధిత బెహరా, విద్యాసాగర్‌లను నాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

CLICK HERE TO READ టర్కీలో వేల్పూర్ వాసి మృతి..

CLICK HERE TO READ MORE

Leave a Reply