అప్ క‌మింగ్ సినిమాలపై భారీ అప్‌డేట్స్!

హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా సినీ పరిశ్రమ సందడిగా మారింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తాజా సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌లు, పోస్టర్‌లను విడుదల చేసి పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు.

  • ఈ సంద‌ర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి – స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పేరు ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ దీపావళి సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. “నవ్వుల టపాసులు సంక్రాంతికి పేలుద్దాం” అంటూ, సినిమా సంక్రాంతి రేసులో ఉండబోతోందని హింట్ ఇస్తూ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు.
  • హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ #PrabhasHanu నుంచి కూడా ఒక ప‌వ‌ర్ ఫుల్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు మేక‌ర్స్. ప్ర‌భాస్ పుట్టిన రోజు (అక్టోబ‌ర్ 23) సంద‌ర్భంగా ఈ నెల 22న మ‌రో అప్ డేట్ తో రానున్న‌ట్టు ప్ర‌క‌టించారు.
  • ఇక‌ ఇటీవల ‘మనమే’ సినిమాతో అల‌రించిన హీరో శర్వానంద్ అభిమానులకు రెండు పెద్ద అప్‌డేట్‌లను ఇచ్చారు. ‘సామజవరగమన’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజ్ డైరెక్షన్‌లో శర్వానంద్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టైటిల్‌ను నారీ నారీ నడుమ మురారి పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
  • అలాగే, అభిలాష్ శంకర్ దర్శకత్వంలో శర్వానంద్ నటించనున్న మరో స్పోర్ట్స్ డ్రామా టైటిల్ ను వెల్లడించారు. ఈ సినిమాకు ‘బైకర్’ అనే పేరును ఖరారు చేశారు.

సంయుక్త యాక్షన్ లుక్..

  • నటి సంయుక్త సైతం దీపావళి వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఆమె నటిస్తున్న కొత్త యాక్షన్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ ఫస్ట్ లుక్‌ను ఈ పండుగ సందర్భంగా అభిమానుల కోసం విడుదల చేశారు.

ఈ విధంగా, దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన కొత్త సినిమా పోస్టర్లు, అప్‌డేట్‌లు ప్రేక్షకుల్లో భారీ ఉత్కంఠను రేకెత్తించాయి. పండుగకు ప్రత్యేకంగా విడుదలైన ఈ పోస్టర్లపై ఓ లుక్కేయండి..

Leave a Reply