బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల భారీ ర్యాలీ..

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల భారీ ర్యాలీ..

జూబ్లీహిల్స్ : వెంగళ్ రావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ (Krishnakanth Park) నుండి యూసఫ్ గూడ చౌరస్తా మీదుగా మధురానగర్ వరకు దాదాపు 3 కి.మీ మేర ర్యాలీ నిర్వ‌హించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా, స్థానిక కార్పొరేటర్ దేదీప్యతో క‌లిసి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) శ్రేణుల క్షేత్రస్థాయి ప్రచారం నిర్వ‌హించారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతమ‌న్నారు. సెటిల్మెంట్ దందాల పార్టీ కాదు.. అభివృద్ధి, సంక్షేమం అందించే మన బీఆర్ఎస్ రావాలన్నారు. తులం బంగారం హామీ ఏమైంది..? అని ప్ర‌శ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాల‌ని తెలంగాణ ప్రజలు అంటున్నార‌న్నారు. రూ.500 కు గ్యాస్ సిలిండర్ హామీ ఏమైందని ప్లకార్డుల‌ను ప్రదర్శించారు. మహిళలకు ఇస్తామన్న 2500 ఎక్కడ పోయాయి అంటూ మహిళా శ్రేణుల ర్యాలీ నిర్వ‌హించారు.

Leave a Reply