USA | భారీగా పెరిగిన హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ పీజు!
అమెరికా ట్రంప్ సర్కార్ హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు భారీ షాకిచ్చింది. ఈ ఏడాది హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుము భారీగా పెంచేసింది. ట్రంప్ ప్రభుత్వం వీసా రుసుమును ఏకంగా 215 డాలర్లుగా పెంచింది.
గతేడాది 10 మాత్రమే ఉన్న దరఖాస్తు రుసుము ఈ ఏడాది 215 డాలర్లకు పెరిగింది. కాగా, యూఎస్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)… వీసా రిజిస్ట్రేషన్ మార్చి 7 నుండి ప్రారంభించనుంది. ఈ రిజిస్ట్రేషన్ల దరఖాస్తు ప్రక్రియకు మార్చి 24 చివరి తేదీ.
లాటరీ ద్వారా ఎంపిక
H1B వీసా ప్రోగ్రామ్ సమగ్రతను పెంచడానికి గత అమెరికా ప్రభుత్వం పలు సవరణలను తీసుకువచ్చింది. దీంతో వీసా రిజిస్ట్రేషన్ ఖర్చులు భారీగా పెరిగాయి. USCIS వార్షిక పరిమితి (65,000 వీసాలు)కి లోబడి ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తుంది. అయితే ఈ ఏడాది కూడా వార్షిక పరిమితికి మించి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉండడంతో.. లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
అయితే, ఒకే వ్యక్తికి బహుల ఎంట్రీలను నివారించడానికి.. బిడెన్ పరిపాలన H-1B వీసా రిజిస్ట్రేషన్ కోసం బెనిఫిషియల్ సెంట్రిక్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది. ఈ బినిఫిషియల్ సెంట్రిక్ సిస్టమ్ విధానంతో ఒక దరఖాస్తుదారుడు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా.. ఒక్కసారి మాత్రిమే అతడి పేరు లాటరీలో నమోదు చేస్తారు. ఈ ఏడాది కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు.