Ticket | భారీ ఆదాయం..
మోపిదేవి, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ఆదివారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. వివిధ సేవల టిక్కెట్ల రుసుము ద్వారా ఆలయానికి రూ. 9,82,581 ఆదాయం (income) వచ్చినట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు సోమవారం తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తగా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

