Fraud | జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం…

  • 50మంది యువత వద్ద రూ.కోటి వసూలు

హైదరాబాద్ : నర్సింగ్ ఉద్యోగాల పేరుతో యువతను మోసగించిన భారీ ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, అందుకు అవసరమైన శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపిస్తామని నమ్మబలికి, 50 మందికి పైగా యువత నుంచి కోటి రూపాయలకు పైగా డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

మూసారాంబాగ్‌లోని వీసా విజన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు, ముఖ్యంగా డైరెక్టర్ డాక్టర్ రఘువీర రెడ్డి, సీతలపై విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేశారు.

జర్మన్ భాషా శిక్షణ, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని బాధితులు తెలిపారు. నెలలు గడిచినా, తాము చెల్లించిన డబ్బులకు ప్రతిఫలంగా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని గుర్తించామని పేర్కొన్నారు.

తాము స్టాఫ్ నర్స్ విద్యార్థులమని, తాము చెల్లించిన ఫీజులను వెంటనే తిరిగి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు మలక్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

అయితే, ఫిర్యాదు చేసి 15 రోజులు అవుతున్నా పోలీసుల నుంచి సరైన స్పందన లేక‌పోవ‌డంతో.. మీడియా ముందుకు వ‌చ్చారు బాధితులు. అంతేకాక, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే కన్సల్టెన్సీ నిర్వాహకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply