Hyd | ఉప్పల్ లో భారీ అగ్ని ప్రమాదం..

ఉప్పల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉప్పల్ శిల్పారామం సమీపంలోని మెట్రెస్ గౌడన్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పెద్దఎత్తున మంట‌లు వ్యాపించడంతో… అందులోని సామాన్లన్నీ మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని… మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Leave a Reply