ఒక వత్తితో దీపం వెలిగించరాదు. 2,5,9,11,16,18,21,28 వత్తులతో దీపారాధన చేయాలి. ఇంకా భక్తి, అవకాశం ఉన్నవారు 51,101,501 వత్తులతో కూడా దీపారాధన చేయవచ్చు. ఇది కామ్య వ్రతం అనగా కోరికలను బట్టి వత్తులతో దీపాలను వెలిగిస్తారు. నిత్యారాధనలో రెండు వత్తులతో రెండు దీపాలను వెలిగించి ఆరాధన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేష్టం. కాకుంటే మనుకు లభించే తైలములతో దీపం వెలిగించవచ్చు. భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో దీపారాధన చేయాలి. భగవంతుడిని ప్రేమించాలి, ఆరాధించాలి.
ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి?
