షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం

అగ్నిప్రమాదంలో కాలిపోయిన సర్టిఫికెట్ లు
ప్రమాదం లో కాలి పోయిన బైక్
రూ.3 లక్షల అస్తి నష్టం

కుంటాల, ఆంధ్రప్రభః కుంటాల మండలంలోని ఓల గ్రామంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ సంభవించి ఉరే విట్టబాయి ఇళ్ళుదగ్దం అయింది. మంటల వ్యాపించి పొగ కమ్ముకోవడంతో మేల్కొని కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంట్లో ఉన్న వస్తూ సామాగ్రి, మోటార్ సైకిల్, ధాన్యం కాలి బూడిదైంది. కీర్తిక విద్యార్థికి చెందిన ఇంటర్ పూర్తి చేయడంతో ఆమె కు సంబంధించిన మెమోలు సైతం కాలిపోయినట్టు పేర్కొన్నారు దీంతో హుటాహుటిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పేశారు ఘటన స్థలాన్ని స్థానిక సర్పంచ్ కట్టా రవి తోపాటు పలువురు నాయకులు షార్ట్ సర్క్యూట్ కాలిపోయిన ఇల్లును వారు పరిశీలించారు అంతేకాకుండా రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఘటన స్థలిని ఆర్ ఐ రాజేశ్వర్, పంచనామ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవి రాజ్ కుమార్ మల్లేష్ స్థానిక నాయకులు తదితరులు పరిశీలించారు.

Leave a Reply