Hospital | ఫర్నేస్ పేలుడు ఘటన

Hospital | ఫర్నేస్ పేలుడు ఘటన

  • ఒకరు మృతి, మరొకరికి తీవ్రగాయాలు

Hospital | మెదక్, ఆంధ్రప్రభ : మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం శివారులోని ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీలో ఇవాళ సాయంత్రం ప్రమాదం చోటుచేసుకుంది. ఫర్నేస్ ఒక్కసారిగా పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు కార్మికుల ఆచూకీ ఇంకా లభించలేదని కంపెనీ వర్కర్లు తెలిపారు.

ప్రమాద సమయంలో ఫర్నేస్ పైన పనులు నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్సు (35) అక్కడికక్కడే మృతి చెందగా, రాజేష్ పాండే (45) తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డాడు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టగా, గల్లంతైన ముగ్గురు కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Leave a Reply